శ్రీశైలం ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తివేత
కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 74,429 క్యూసెక్కులు, అవుట్ 82,963 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటి మట్టం 884.70 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం నీటి నిల్వ 213.8824 టీఎంసీలుగా నమోదు అయ్యింది. శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 7 జనరేటర్ల ద్వారా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.