దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు
నిందుతులను అరెస్టు చేసిన ఖమ్మం త్రీ టౌన్ సిఐ
జల్సాకు అలవాటు పడి
దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందుతులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఖమ్మం త్రీ టౌన్ సిఐ శ్రీధర్ తెలిపారు.
ఇటీవల నగరంలోని ప్రకాష్ నగర్ కు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ వలపు మహేందర్ ఇంట్లో మరియు మెడికల్ షాపులో చోరి జరిగిందని 40 వేల రూపాయల నగదు గుర్తుతెలియని దొంగలు దొంగిలించినారని ఖమ్మం త్రీ టౌన్ పోలీసు స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సిఐ తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఈరోజు ఉదయం అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను ఇద్దరు పంచుల సమక్షంలో విచారించి సోదా చేయగా 36 వేల రూపాయల నగదు లభించాయి. ప్రకాశ్ నగర్ కు చెందిన జింకల సాయి సామ్రాట్, చొప్పరి పవన్, గణపవరపు వెంకటేష్ అనే ఈ ముగ్గురు కలసి వలపు మహేందర్ ఆర్ఎంపి డాక్టర్ కు చెందిన మెడికల్ షాపులో దొంగిలించిన సొమ్ముగా వారు ఒప్పుకున్నారు.ఈ నేపథ్యంలో
నిందుతులను అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగిందని సిఐ వివరాలు వెల్లడించారు. ఇట్టి కేసును దర్యాప్తు చేసిన ఎస్సై శ్రవణ్ కుమార్ ను, సీఐ శ్రీధర్ ను ఉన్నతాధికారులు అభినందించారు.