అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా, ఈ రోజు హైదరాబాద్, మెహిదిపట్నం, సాఫ్దారియా బాలిక పాఠశాల లో సానిటరీ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్
” భేటీ బచావో – భేటీ పఢవో మరియు సబ్కాసాథ్, స , సభ్కావిశ్వాస్” అద్యక్షుడు డా.తోట శ్రీకాంత్ కుమార్ గారి కోరిక మేరకు అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా 12/10/2020 తేదీన భారత్ బజార్ – కిసాన్ టు కిచెన్ / టైమ్స్ సంస్థ వ్యవస్థాపకుడు మరియు భారత్ సాధన సమితి, జాతీయ అధ్యక్షుడు శ్రీ రాజ్ గురు గారు తమ కంపెనీ చెందిన “మంత్లీ టైమ్స్” సానిటరీ న్యాప్కిన్స్ ను హైదరాబాద్ మెహిదిపట్నం నందు గల సఫ్దదారియ బాలికల ఉన్నత పాఠశాల లో బాలికలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ తమిజ్ బేగం గారు, ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కన్సల్టెంట్ V.V.మహేశ్వర రావు గారు, ఆర్ట్ డైరెక్టర్ శ్రీ లక్ష్మి సింధుజ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి సింధుజ గారు విద్యార్థులతో ముఖాముఖి అయి, సానిటరీ న్యాప్కిన్స్ గురించి తెలుసుకోవడం లో సిగ్గు పడవలసిన అవసరం లేదని.. వాటి గురించి అందరూ అవగాహన కలిగి ఉండాలి అన్నారు. పాఠశాల యాజమాన్యం సానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ చేసిన రాజ్ గురు గారిని మరియు సహకరించిన డా. తోట.శ్రీకాంత్ కుమార్ గారిని అభినందించారు.