Corona Effect: నా దగ్గరకు ఎవరూ రావొద్దు.. మోహన్ బాబు ఆత్మీయ విన్నపం
ప్రపంచాన్నే కంగారు పెడుతోంది కరోనా. ఈ వైరస్ విజృంభణకు బ్రేకులు పడక పోవడంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలు, ప్రజలు అలర్ట్ అయ్యారు. భయాందోళనలకు గురవుతున్నప్పటికీ.. తగిన జాగ్రత్తలు తీకుంటున్నారు. ఇప్పటికే ఈ వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సూచనలిచ్చారు. భారతదేశంలో కూడా కరోనా కోరలు చాస్తోంది. దీంతో కరోనా అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రద్దీ ప్రదేశాల్లో తిరగకూడదని పేర్కొంటూ స్కూల్స్, కాలేజెస్, థియేటర్స్ లాంటి జనసమూహం ఉండే ప్రదేశాలపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో తాజాగా కరోనా పట్ల స్పందిస్తూ ఓ విన్నపం ప్రజల ముందుంచారు మోహన్ బాబు.