సినిమా హాళ్ల మూసివేత.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొన్నది. తెలంగాణ పరిస్థితి చేజారిపోతున్న సమయంలో ప్రభుత్వం సినిమా హాళ్లను, విద్యాసంస్థలను నిరవధికంగా వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనావైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని షాపింగ్ మాల్స్, థియేటర్లు, విద్యాసంస్థలను మార్చి 31వ వరకు మూసి వేయాలని నిర్ణయం తీసుకొన్నాం అని తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది