ఛత్తీస్గఢ్ రాజనంద్ గావ్ జిల్లా లో మావోయిస్టుల ఘాతుకం
రోడ్డు పనులు చేస్తున్న ఓం ప్రైవేటు కాంట్రాక్టర్ కు చెందిన ఐదు వాహనాలకు దగ్ధం చేసిన మావోయిస్టులు.
గత కొంతకాలంగా రాజనంద్ గావ్ జిల్లాలో స్తబ్దత గా వున్న మావోయిస్టులు మావోయిస్టు వార్షికోత్సవాల సమయంలో మరోసారి రెచ్చిపోయారు.జిల్లాలోని అంబాగడ్ లోని మోహలా ప్రాంతం కొద్ది దూరంలో నక్సల్ ప్రభావిత ప్రాంతం పర్వీహీడ్ గ్రామం లో రోడ్డు పనుల్లో భాగంగా రహెసేతు వంతెన నిర్మాణం చేపట్టిన జగదల్ పూర్ చావ్లా కన్స్ట్రక్షన్ కు చెందిన ఒక ప్రొక్లైన్, రెండు మిక్సర్స్,ఒక హైడ్రాలిక్ వాహనంతో సహా ఐదు వాహనాలకు నిప్పంటించి దగ్దం చేశారు.ఈ ఘటనను రాజనంద్ గావ్ జిల్లాలోని మోహలా టిఐ వీరేంద్ర సింహ ధృవీకరించారు.