“అమృతం – For Ever” చిత్రం అవగాహన
ఆగస్టు 1 వ తేదీ నుంచి 7 తేదీ వరకు జరిగే “ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు” సందర్భంగా, తల్లి పాల గొప్పతనాన్ని, అందులోని ఔషద విలువలు, ప్రపంచంలో చాలా దేశాల్లో తల్లి పాల కొరత సమస్యను, పుట్టిన బిడ్డకు పాలు అందకపోవడం వంటి విషయాలను వివరిస్తూ “డా.తోట శ్రీకాంత్ కుమార్” దర్శకత్వంలో రూపొందించిన “అమృతం – For Ever” అనే అవగాహన చిత్రాన్ని ఈ రోజు 06/08/2020 తేదీన T.T.D. బోర్డ్ మెంబర్ మరియు గో సంరక్షకుడు శ్రీ శివ కుమార్ గారు విడుదల చేశారు. శివ కుమార్ గారు మాట్లాడుతూ, దర్శకుడు తోట శ్రీకాంత్ కుమార్ తల్లి పాల గురించి అవగాహన చిత్రం రూపొందించడం చాలా అభినందనదాయకంమని, తల్లి పాల గొప్పతనాన్ని ఎంతో సృజనాత్మకంగా వివరించారని, తల్లి పాలు ఇచ్చే ఆరోగ్యాన్ని – ఆవు ఇచ్చే సంరక్షణ వెల కట్టలేనిదని.. ఈ చిత్రం సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కాన్సల్నెంట్ V.V.మహేశ్వర రావు గారు మాట్లాడుతూ “ఈ తల్లి పాల కొరత సమస్య ఒక్క భారతేశంలోనే కాదు ప్రపంచంలో చాలా దేశాల్లో ఉందని , ఈ అంశం మీద చిత్రం తీయడం మంచి ఆలోచనని, చిత్రంలో ప్రపంచ దేశాల్లో తల్లి పాల సమస్య ఎలా ఉందో దర్శకుడు తోట శ్రీకాంత్ కుమార్ చక్కగా వివరించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో “అమృతం – For Ever” అవగాహన చిత్రంలో నటించిన రామ సింధు, లావణ్య పంద్రే, అశోక్ రాథోడ్, దేవేందర్ కొన్నే అక్షయ పాత్ర – ఐక్య కన్వీనర్ సాయి కిరణ్ గోనె, సినీ గేయ రచయిత రామారావు మాతుమూరు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు