భారతదేశం ఆయన కోసం కాచుకొని వుండింది. అందుకే ఆయన వచ్చాడు. భూమి మీద నడిచింది ముప్పైతొమ్మిది సంవత్సరాలే. కానీ మూడువేల తరాలు గడచినా ఆయన ప్రభావం తగ్గిపోదు. ” ఈ దేశపు పేద , దళిత కోటి హృదయాలనుండి స్రవించిన రక్తం తో పెంచబడి , విద్యాబుద్ధులు గడించి , వారి గురించి తలవైనా తలవని ప్రతి వ్యక్తీ నా దృష్టిలో ఒక దేశద్రోహియే ! ” అని బాంబులు కురిపించినట్టు వుండే వివేకానంద మాటలను మనందరమూ ప్రతి రోజూ గుర్తు చేసుకోవాలి. మానవ జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే , లోకం తీరు ను అర్థం చేసుకోవాలి , లోకం అర్థం కావాలనుకొంటే , భారతదేశాన్ని అర్థం చేసుకోవాలి , భారతదేశం అర్థం కావాలంటే వివేకానందుడి జీవితాన్ని మనం చదివి అర్థం చేసుకోవాలి. ఆ దివ్యపురుషుడు పుట్టిన ఈ భూమిలో పుట్టి , ఆయన చెప్పినవాటిలో కనీసం ఒక్కటైనా పాటించకపోతే మనం ఆయనకు ద్రోహం చేసినట్టే. గౌతమ బుద్ధుడు + ఆదిశంకరుడు = వివేకానందుడు.
ఈరోజు ఆయన జన్మదినం. [ జనవరి 12 , 1863 ]