- రెండు టవర్లు.. ఒక్కో టవర్‌లో 33 అంతస్థులు
- అమరావతి సూచిక ఏ అక్షరం నమూనాతో నిర్మాణం
- 22న శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
తుళ్లూరు/అమరావతి: రాజధాని అమరావతిలో అద్భుతంగా ఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్‌ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రాయపూడి గ్రామానికి తూర్పుభాగంలో ఐదెకరాల్లో ఒక్కో టవర్‌ని 33 అంతస్థులతో రెండు టవర్లను నిర్మించనున్నారు. ఈ కట్టడాలకు ఈ నెల 22న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి పేరులోని ఏ అక్షరం సూచించే విధంగా దీని నమూనా అనుమతి పొందింది. రెండు టవర్ల మధ్యలో రివాల్వింగ్ రెస్టారెంటు నిర్మించేలా నమూనాను తీర్చిదిద్దారు.
అమరావతిలో ఎన్ఆర్టీ పెట్టుబడులు
జన్మభూమిని వదలి ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో ఆంధ్రులు 40 వేలకు పైగా నివసిస్తున్నారు. వారందరూ ఒక సంఘంగా ఏర్పడ్డారు. ప్రపంచంలో స్వతంత్ర సభ్యత్వం కలిగిన ఏకైక సంస్థ ఎన్ఆర్టీ(నాన్ రెసిడెన్స్ తెలుగు అసోసియేషన్)గా చెప్పవచ్చు. రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించటానికి ఎన్ఆర్టీ సభ్యులు గతంలో సీఎం చంద్రబాబును సంప్రదించారు. రాజధానికి వచ్చిన ప్రవాసాంధ్రుల అవసరాలు, ఇబ్బందులు పరిష్కరించేందుకు, అలాగే కంపెనీలు ఏర్పాటు చేసుకునే విధంగా ఈ ఐకాన్ టవర్స్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉండేందుకు ఎన్ఆర్టీ ముందుకు వచ్చిందని అసోసియేషన్ అధ్యక్షుడు రవి వేమూరి చెప్పారు.
2014 మే లో చంద్రబాబు సూచనతో ఎన్ఆర్టీ ఆవిర్భవించింది. ప్రభుత్వ భాగస్వామ్యంతో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఎన్ఆర్టీ చేపట్టింది. ఏపీలో ఐటీ సెక్టార్లు ఏర్పాటు చేసి 300 ఉద్యోగాలు కల్పించింది. 27 ఐటీ కంపెనీలు స్థాపించటానికి, యువతకు శిక్షణ ఇచ్చేందుకు 19కి పైగా పేరొందిన కంపెనీలను ఏర్పాటు చేసింది. రక్షణ, ఎలకా్ట్రనిక్ రంగాలకు చెందిన 130కి పైగా చిన్నా, పెద్ద తరహా పరిశ్రమలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుంది. మంగళగిరిలో ఈ హెల్త్ ఐటీ సర్వీసు క్లష్టర్, మెక్రోసాఫ్ట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు సిద్ధమైంది. 11 ప్రాజెక్టులను నెలకొల్పి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్ఆర్టీ సిద్ధంగా ఉంది. 93 గ్రామాలలో 20 కోట్లు ఖర్చు చేసి మౌలిక వసతులను కల్పించింది. రాజధానిలో ఐకాన్ టవర్ల నిర్మాణంతో యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కలుగుతాయని సీఆర్డీఏ అధికారులు చెపుతున్నారు.
గుర్రపు డెక్క తొలగింపు
ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగింపు పనులను జలవనరులశాఖ అధికారులు జేసీబీ సాయంతో చేపట్టారు. బ్యారేజీ వద్ద నదిలో దుర్గాఘాట్ పరిసర ప్రాంతాల్లో పదిరోజుల క్రితం కొద్దిమేర ఉన్న గుర్రపుడెక్క క్రమంగా విస్తరించి పెరిగింది. దీంతో బోటింగ్‌కు ఇబ్బందికరంగా మారింది. దీంతో ఇరిగేషన్ అధికారులు నదిలో పేరుకు పోయిన గుర్రపు డెక్కను జేసీబీతో తొలిగిస్తున్నారు.
FOLLOW US ON FACEBOOK:
www.facebook.com/hindutv.co.in
www.facebook.com/hindutv.co.in