- సెట్స్ పైకి మహేశ్ 25వ మూవీ
- దర్శకుడిగా వంశీ పైడిపల్లి
- డెహ్రాడూన్ లో షూటింగ్
మహేశ్ .. వంశీ పైడిపల్లి కాంబినేషన్లోని సినిమా రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గా మొదలైంది. ముందుగా చేసిన ప్లాన్ ప్రకారం ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను డెహ్రాడూన్ లో మొదలుపెట్టారు. సినిమాలో హీరో తండ్రి పాత్ర కూడా చాలా బలమైనదిగా .. ముఖ్యమైనదిగా కనిపిస్తుందట.అందువలన ఆ పాత్ర కోసం ప్రకాశ్ రాజ్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
తన సినిమాల్లో ప్రకాశ్ రాజ్ ఉండేలా చూసుకుంటూ ఉంటానని ఒక వేదికపై మహేశ్ చెప్పాడు.ఆయన వలన ఆ పాత్ర ప్రత్యేకత పెరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ పాత్ర తీరుతెన్నులు ఎలా వుంటాయో చూడాలి మరి. ఈ కారణంగానే మహేశ్ సినిమాల్లో సాధ్యమైనంత వరకు ప్రకాశ్ రాజ్ కనిపిస్తూ ఉంటాడు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు.
FOLLOW US ON FACEBOOK:
www.facebook.com/hindutv.co.in