ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)-12 సీజన్‌కు సంబంధించి BCCI సన్నాహాలు మొదలు పెట్టింది. 2019లో ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచకప్ వన్డే వరల్డ్ కప్ మే 30న ఆరంభం కానుంది. ఇందులో భాగంగా ముందుగానే IPL ను నిర్వహించాలని BCCI నిర్ణయించుకుంది. లోధా కమిటీ సిఫార్సులతో ఐపీఎల్‌కు, ఏదైనా క్రికెట్ టోర్నీ మధ్య కనీసం 15 రోజుల టైం ఉండాలి. ఈ క్రమంలో 2019, మార్చి 29న IPL-12 ఆరంభించాలని ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు కూడా జరగనుండటంతో.. ఎన్నికలు జరిగే సమయంలోనే మ్యాచ్‌లు నిర్వహిస్తే భద్రత కల్పించడం చాలా కష్టం. దీంతో 12వ IPL సీజన్‌ను భారత్‌లో కాకుండా మరో దేశంలో నిర్వహించే ఆలోచనలో ఉంది.
FOLLOW US ON FACEBOOK:
www.facebook.com/hindutv.co.in